ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి రాజకీయ పార్టీలకు, పోటీచేసే అభ్యర్థులకు మినహాయింపులు ఇచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికలు సమీపిస్తుండటంతో రేపు మరోమారు కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్షను నిర్వహించబోతున్నది. రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కేసులను దృష్టిలో పెట్టుకొని అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.