Manipur: మణిపూర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీరెన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ సీఎంగా బీరెన్‌సింగ్ సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ గణేశన్ ప్రమాణం చేయించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంఫాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ హాజరయ్యారు. హెయ్‌గాంగ్ నియోజకవర్గం నుంచి బీరెన్ సింగ్ 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీరెన్‌సింగ్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా రెండోసారి మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కాగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీరెన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రాన్ని అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాత్రి, పగలు కష్టపడతానని శపథం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అన్న మాటే లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీలోని తిరుగుబాటుదారులను ఒకచోట కూర్చోబెట్టి వారితో చర్చించి సమస్యను పరిష్కరించేలా చేస్తానని కూడా బీరెన్ సింగ్ ప్రకటించారు.
Also Read
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!