AP Students: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు మరింత ముమ్మరంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీల్లో ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా ఎంపిక చేసి, మిగిలిన ఏపీ విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకరించింది. ఇండిగో విమానయాన సంస్థతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 157 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీలలో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్ధిని నోడల్ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారి ద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్ధుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.విద్యార్ధులను ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్థులను తరలించడానికి పౌర విమానయాన శాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రైవేటు విమానయాన సంస్ధలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు.
Read Also: Botsa Satyanarayana: తల్లిదండ్రులు అధైర్యపడొద్దు.. 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం..
కర్ఫ్యూ నిబంధనలకు సడలింపు
ఇదిలా ఉండగా.. కర్ఫ్యూ నిబంధనలకు మణిపూర్ ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. రేపు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంఫాల్ నగరంలో కర్ఫ్యూ సడలింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు గంటల పాటు కర్ఫ్యూ సడలింపు చేస్తూ పశ్చిమ ఇంఫాల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంఫాల్‌లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు వెళ్ళే విధంగా మణిపూర్ సర్కార్ వెసులుబాటు కల్పించింది.