Manipur: ఏడాదిన్నర కాలంగా మైయిటీ, కుకీల మధ్య జాతుల ఘర్షణలో అట్టుడికుతున్న మణిపూర్‌లో గత వారం రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సీఎం పదవిని ఎవరూ తీసుకోకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. అయితే, రాష్ట్రపతి పాలన విధించిన తొలి వారంలోనే భద్రతా బలగాలు అక్కడి ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపులపై భారీ అణిచివేత కార్యక్రమాలు చేపట్టారు.
Manipur: గత రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణ కారణంగా ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొత్తగా ఎవరూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. దీంతో కేంద్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Nitish Kumar: బీజేపీ ప్రభుత్వానికి సీఎం నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూకి ఉన్న ఒక ఎమ్మెల్యే మద్దతుని విత్ డ్రా చేసుకుని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డారు. అయితే, ఈ పరిణామం అక్కడి ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపదు. బీజేపీ ప్రభుత్వ మెజారిటిపై పెద్దగా ఎఫెక్ట్ పడదు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు.
Manipur Violence: మణిపూర్లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది.
హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు.