ప్రధాని మోడీ మణిపూర్ టూర్‌పై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ విమర్శలు గుప్పించారు. జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించడం దురదృష్టకరం అన్నారు. ఇది ప్రధానుల సంప్రదాయం కాదని పేర్కొన్నారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే వెళ్లేవారని.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రధానులంతా ఇదే పాటించారని గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తు మన ప్రధాని మాత్రం రెండేళ్ల తర్వాత ఆ సూత్రాన్ని పాటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఘర్షణలు జరిగినప్పుడే వెళ్లుంటే ఎంత బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. తీవ్ర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారని ఆరోపించారు.
ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం: మోడీ
ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. ఉదయం ఇంఫాల్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడ నుంచి రోడ్డుమార్గంంలో చరాచంద్‌పూర్ చేరుకున్నారు. అక్కడ నిర్వాసితులతో ముచ్చటించారు. చిన్నారులతో కాలక్షేపం చేశారు. అనంతరం జరిగిన సభలో మోడీ ప్రసగించారు. మణిపూర్ ప్రజల అభిరుచికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మీరందరూ ఇక్కడికి వచ్చారని.. మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Bathing Soaps: సబ్బులలో ఎలాంటి పదార్థాలు ఉంటే మంచిదో తెలుసా?
భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్‌లో రాలేకపోయానని.. రోడ్డు మార్గంలో రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోడ్డుపై చూసిన దృశ్యాల తర్వాత హెలికాప్టర్ పనిచేయకపోవడం పట్ల సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మణిపూర్ యువకులు, వృద్ధులు చేతుల్లో తిరంగను తీసుకెళ్తున్న తీరు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని మోడీ తెలిపారు. ఇక నిర్వాసితులకు రూ. 500 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్రజలు సంఘర్షణ కంటే శాంతి, పురోగతిని కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధికి శాంతి అవసరంఅన్నారు. ఇక చురచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. చురచంద్‌పూర్‌లో పట్టణ రోడ్లు, హైవేలు, మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్ చొరవతో సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: IPS Officers Transfers In AP: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం ఫోకస్.. ఎస్పీలతో వరుస భేటీలు!