Kolkata Rape Case: కోల్‌కతా లా కాలేజ్ క్యాంపస్ లోపల 24 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం పశ్చిమ బెంగాల్‌ని కదిపేస్తోంది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్లో పీజీ వైద్యురాలిపై అత్యాచారం ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే, రాజకీయ రచ్చ మొదలైంది.
Amit Shah: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి మమతా ‘‘ఆపరేషన్ సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల, ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లు రాష్ట్ర స్పాన్సర్ చేసిందని అన్నారు. ‘‘ ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, మమతా దీదీ ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించారు. అలా చేయడం ద్వారా, ఆమె ఈ దేశంలోని తల్లులు,…
హింసాకాండ చెలరేగిన ముర్షిదాబాద్‌లో ఈ రోజు ( ఏప్రిల్ 18న ) నుంచి రెండో రోజుల పాటు పర్యటించబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
గత కొద్ది రోజులుగా బెంగాల్ అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పలు చోట్ల హింస చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలయ్యాయి.
ఇక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కుట్రలు చేసి అధికారంలోకి రావడానికి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనింది.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముర్షిదాబాద్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
Tarun Chugh: బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక అల్లర్లపై మమతా బెనర్జీ ఏం చేయడం లేదని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. హింసకు మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తోంది. బెంగాల్లో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరిగిన వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింస చోటు చేసుకుంది.
BJP: వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గుంపు హింసకు పాల్పడుతోంది. ఇటీవల ముర్షిదాబాద్, మాల్దాలో ఇలాంటి ఘటనలే జరిగాయి, రాళ్లదాడితో పాటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి.
పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ముర్షిదాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి.. పోలీస్ వాహనాలు తగలబెట్టారు.