DSP Richa Ghosh: భారతీయ మహిళా క్రికెట్ జట్టులోకి మరో డిస్పీ వచ్చారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన రిచా ఘోష్, పశ్చిమ బెంగాల్ పోలీసులో డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెకు నియామక లేఖను స్వయంగా అందజేశారు. భారత మహిళా జట్టు ఇటీవలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా సైతం డిఎస్పీ బాధ్యతలు స్వీకరించనుంది.
READ MORE: Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?
అంతే కాదు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రిచా ఘోష్‌ను “బంగా భూషణ్” అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు బంగారు గొలుసును బహూకరించింది. CAB ఆమెకు బంగారు బ్యాట్, బంగారు బంతిని బహుకరించింది. అదనంగా, రిచా రూ.3.4 మిలియన్ల నగదు బహుమతిని అందుకుంది. 2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా కలను చెదరగొట్టి భారత్ తొలిసారి మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. టైటిల్ మ్యాచ్‌లో భారత జట్టు తరపున రిచా ఘోష్ 34 పరుగులు చేసి, భారత్ 300 పరుగుల స్కోరును నమోదు చేయడంలో సహాయపడింది. కాగా.. రిచా ఘోష్ కంటే ముందు, ఈ ఏడాది జనవరిలో ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ పోలీస్‌లో డీఎస్పీగా నియమితులైంది. 2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో భారత పురుషుల జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా తెలంగాణ పోలీస్‌లో డీఎస్పీ అయ్యారు.