Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు.
Read Also: Tata Sierra: ధరల విషయంలో నిన్ను కొట్టేవాడు లేడు.. టాటా సియోర్రా ధర, బుకింగ్స్, డెలివరీ..
బీహార్‌లో బీజేపీ ఆట ఆడిందని మమతా బెనర్జీ ఆరోపించింది. బెంగాల్‌లో సర్ జరగకూడదని ఆమె అన్నారు. బెంగాల్‌లో తనను, తనను ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే తాను దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి మొత్తాన్ని దేశాన్ని కదిలిస్తానని ఆమె బీజేపీని హెచ్చరించింది. ‘‘బెంగాల్‌లో మీరు నన్ను లక్ష్యంగా చేసుకుని, నా ప్రజలపై జరిగే దాడిని వ్యక్తిగత దాడిగా భావిస్తే, నేను మొత్తం దేశాన్ని కదిలిస్తాను. ఎన్నికల తర్వాత నేను మొత్తం దేశాన్ని తిరుగుతాను’’ అని ఆమె అన్నారు.
‘‘ఒక ‘‘SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)’’ నిర్వహించడానికి మూడేళ్లు పడుతుంది. ఇది చివరిసారిగా 2002లో జరిగింది. మేము SIRను వ్యతిరేకించడం లేదు, కానీ నిజమైన ఓటర్లను తొలగించవద్దని చెప్పాము. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఓట్లను తొలగించవద్దని చెప్పాము, బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి జాబితాను సరిచేస్తోంది. ఈసీ బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ పని నిష్పాక్షికంగా ఉండటం, బీజేపీ కమిషన్‌గా ఉంటడం కాదు’’ అని బొంగావ్ లో జరిగిన సర్ వ్యతిరేక ర్యాలీలో మమతా బెనర్జీ అన్నారు.