Bengal gang-rape Case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన, విద్యార్థిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: బెంగాల్ గ్యాంగ్ రేప్ ఘటనలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..
అయితే, ఈ కేసులో బాధితురాలు తనకు జరిగిన భయానక అనుభవాలను వెల్లడించింది. ‘‘వారు తమ వాహనాన్ని వదిలి మా వైపు వస్తున్నట్లు గమనించాము. మేము అటవి వైపు పరిగెత్తడం ప్రారంభించాము. అప్పుడు ముగ్గురు వ్యక్తులు మా వెంట పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను పట్టుకుని, అడవిలోకి లాక్కెళ్లారు’’ అని చెప్పింది. నిందితులు తన ఫోన్‌ని లాక్కుని, తన స్నేహితుడికి ఫోన్ చేయాలని బలవంతం చేశారని వెల్లడించింది. ‘‘తనను బలవంతంగా పడుకోపెట్టారు. నేను అరిచినప్పుడు, శబ్ధం చేస్తే, మరింత మంది మగవాళ్లకు ఫోన్ చేస్తాం వారు కూడా వచ్చి అత్యాచారం చేస్తారు’’ అని బెదిరించినట్లు చెప్పింది
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల మెడిసిన్ విద్యార్థినిపై శుక్రవారం రాత్రి, మెడికల్ కాలేజ్ క్యాంపస్‌కు సమీపంలో అత్యాచారానికి గురైంది. ఆమె తన స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో కాలేజ్ మాజీ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. ఈ దారుణ ఘటన కాలేజీ పక్కనే ఉన్న కాళీ బారి శ్మశాన వాటిక పక్కన ఉన్న అడవిలో జరిగింది.