వలస వాదులతో అసలు వారికి నష్టం జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ లో పుట్టి. పెరిగి భావజాలం నమ్మిన అనేక మందికి కమిటీ ఏర్పాటులో ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.
హైదరాబాద్ లోని ధర్నా ఛౌక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్రంపై మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. కళ్ళ ముందే బీజేపీ ఆస్తులను అమ్మేస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.…
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి…
తెలంగాణ కాంగ్రెస్లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ…
ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గా రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తాము కేసీ వేణుగోపాల్తో చర్చించామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ పార్టీ అంతర్గత విషయాలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో భారీ చేరికలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో.. మోదీ పర్యటన ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని…