Congress Walkout: తెలంగాణ శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. శాసనసభలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు అసెంబ్లీ పరిసరాల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Read also: BIG Breking: రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
ఈ సందర్భంగా సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. అందుకే నిరసనకు దిగారు. రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగిపోయాయని అన్నారు. రైతులకు 4 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. కరెంటు ఏ సమయంలో ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చామని, అయితే స్పీకర్ చర్చకు అనుమతించలేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల రూపంలో రూ. 16 వేల కోట్ల భారం వేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ.. పంటలు పండే సమయంలో కరెంట్ కట్ చేస్తున్నారని విమర్శించారు. నాణ్యమైన కరెంట్ అందించి రైతులను ఆదుకోవాలని సీతక్క కోరారు.
Fire Accident: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగడంతో..