CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది.
Mallu Bhatti Vikramarka: ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 2017లో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని కుదిపేసిందని గుర్తు చేస్తూ.. ఆ ఘటన వెనుక ఉన్న అసలు బాధ్యులను దేశ ప్రజలముందు నిలబడే చర్యనే అతి పెద్ద ప్రశ్నగా ఆయన అభివర్ణించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2017 లో రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని షేక్ చేసింది. సూసైడ్ లేఖలో రోహిత్…
‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని కొనియాడారు. కన్నప్ప కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని గొప్పగా అనిపించాయని.. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. జూన్…
Bhatti Vikramarka : రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేని పరిస్థితుల్లోనూ, అప్పులపై వడ్డీలు కట్టడం వంటి ఆర్థిక బాధ్యతలు వహిస్తూ సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం…
Bhatti Vikramarka : కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మల్లన్నపాలెం గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో…
KTR : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే…డొల్ల అని తేలిపోయింది. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే…
Electricity Demand: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరగడంతో 16000 మెగావాట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 19 ఉదయం 7 గంటల 55 నిమిషాలకు 16058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే నెల 10వ తేదీన 15998 మెగావాట్లు నమోదు కాగా తాజా డిమాండ్ ఆ రికార్డును అధిగమించింది. గత ఏడాది…
బిల్డర్స్కు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నోవాటెల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్లు గుర్తించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. హైదరాబాద్లోని మ్యారిగోల్డ్ హోటల్లో జరిగిన ‘నాబార్డ్’ స్టేట్ క్రెడిట్ సెమినార్ 2025-26కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. నాబార్డ్ స్టేట్…