హైదరాబాద్ లోని ధర్నా ఛౌక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్రంపై మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. కళ్ళ ముందే బీజేపీ ఆస్తులను అమ్మేస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ లను ఉసి గొల్పి జైలు పాలు చేస్తున్నారని నిప్పులుచెరిగారు. జెండా పండగ చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
read also: Illegal Weapons in Telangana: హైదరాబాద్ లో రాజ్యమేలుతున్న గన్ కల్చర్..
ధరలు పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని కంట్రోల్ చేయడానికి చర్యలు చేపట్టిందని, బహుళ జాతి కంపెనీలకు గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు, నిత్యవసర వస్తువుల కట్టబెట్టడానికే ధరలు పెరుగుదల అంటూ విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ కార్యాలయంల కి పోలీసులను పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మనం చూస్తూ ఉరుకుంటే ఇంతకన్నా తప్పిదం ఉండదని భట్టి విక్రమార్క అన్నారు. 75 సంవత్సరాల ఆజాద్ అమృత్ మహోత్సవ ఉత్సవాలు చేసుకుంటుంన్నామంటే.. దారికి గల కారణం కాంగ్రెస్ పార్టీ నే..! అని గుర్తుచేసారు భట్టి. కార్యకర్తలంతా మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని, శాంతియుతంగా చలో రాజ్ భవన్ చేద్దామని పిలుపు నిచ్చారు.