Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయిందని అన్నారు. ఈ నెల 6 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలోొ హాత్ సే హాత్ జోడో ప్రారంభం అవుతుందని అన్నారు. గడపగడపకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం అని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. 8 ఏళ్ల గడుస్తున్నా.. కేజీ టూ పీజీ ఉచిత నిర్భంధ విద్య అమలు కాలేదని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టి నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులు రద్దు చేసి సుమారు రూ.600 కోట్లు మన ఊరు మనబడి పథకానికి మళ్లించారని అన్నారు.
Read Also: AP Crime: బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు.. కోరిక తీర్చేందుకు తిరస్కరించిన మహిళ గొంతు కోశాడు..
ఇదిలా ఉంటే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాత్ సే హాత్ జోడో యాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుందని, పార్టీ ఎక్కడ నుంచి నడవమని ఆదేశిస్తే అక్కడి నుంచే పాదయాత్ర చేస్తానని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగాలని.. బడ్జెట్ అంచనాలను పెంచుతున్నారు, కేటాయింపులను పెంచుతున్నారు కానీ ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ షెడ్యూల్ ప్రకారం యాత్రలు ఉంటాయని, రాష్ట్రమంతా పాల్గొననున్నట్లు తెలిపారు. ఎల్లుండి ఇంఛార్జులతో సమావేశం ఉంటుందని.. ఆ తరువాత హాత్ సే హాత్ జోడో యాత్రలపై స్పష్టత వస్తుందని అన్నారు.