తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి నడిపేందుకు కీలక సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. విబేధాలను వదిలి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో అందరి నేతల అభిప్రాయం తీసుకున్న రాహుల్.. భేటీకి సంబంధించిన విషయాలను ముగ్గురు మాత్రమే మీడియాకు వెల్లడించాలని సూచించారు. దీంతో.. సమావేశం ముగిసిన తర్వాత.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…
సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్..…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. క్రమంగా సీఎంను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.. ఈ అంశంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భట్టి……
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్దసంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక…
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్…
రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ…
దళిత బంధు కింద కేసీఆర్ ఇస్తామని చెప్తున్న 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు అని చెప్పిన భట్టి విక్రమార్క ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే అన్నారు. దీన్ని ఏదో ఒక్క నియోజక వర్గంలో పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి అని తెలిపారు భట్టి. కో ఆర్డినెటర్లు నియోజక వర్గాలలో ఈ విషయాలను బాగా విస్తృత ప్రచారం చేయాలి అని సూచించారు. నియోజక…
కొత్తగా ఎంపికైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ నిర్ణయం తో పిసిసి గా రేవంత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ గా సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురి అవుతుందని… సోనియా గాంధీ ఆశించిన లక్ష్యాలు అమలు కావడం…
విజన్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయన ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. గాంధీభవన్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోందని మండిపడ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్యబట్టిన ఆయన.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉందన్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి…
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ మారుతున్నాడంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులపై కూడా బీజేపీ ఇలాంటి కట్టు కథలను నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో చెబుతోంది.. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ…