డిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నారు.. విజ్ఞాన భవన్లో జరిగే సదస్సులో దేశంలోని పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. కాంగ్రెస్ న్యాయ సదస్సును మొత్తం ఐదు సెషన్లుగా విభజించారు 1. సామాజిక న్యాయం & రాజ్యాంగం: సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు 2. మతం & రాజ్యాంగం: నియంత్రణలు, మార్గదర్శకాలు 3. అధికార విభజన,…
Mallikarjun Kharge: ఢిల్లీలో ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు రాహుల్ గాంధీని తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు చేపట్టారు. ఇక సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే పై ప్రశంసలు గుప్పించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బలహీన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్లో…
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కఠిన పదజాలంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. మణిపూర్ సంక్షోభం గురించి పట్టించుకోకుండా మోడీ ఎక్కువగా టీవీల్లో కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తరుచుగా మీడియాకు రావడాన్ని ఖర్గే తప్పుపట్టారు. మోడీ ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తారని, ఆయన టీవీ స్ట్రీన్‌పై లేని రోజు లేదని, ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఉన్నప్పటికీ, గతంలో ఏ ప్రధాని కూడా రోజూ తెల్లవారుజామున టీవీల్లో మొరిగింది లేదని ఖర్గే విమర్శించారు.
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత..…
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొదట్లో బుజ్జగించారు. ఆ తర్వాత అగ్రనాయకత్వంతో మాట్లాడించాలని నిర్ణయించింది పార్టీ. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే... అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు.
Kharge Slams BJP: పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు.
Kharge Serious On MLAs: హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు.
Konijeti Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రోశయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లోని లక్షీకాపూల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి పాల్గొన్నారు. రోశయ్య సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. Thammudu : ‘తమ్ముడు’ రివ్యూ.. ఇంకెప్పుడు నితిన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, రోశయ్య రాజకీయాల్లో చేసిన సేవలు…