Congress: హిమంత దారిలో భూపెన్ బోరా.. మరో కీలక నాయకుల్ని కోల్పోయిన కాంగ్రెస్..
- అస్సాం ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్..
- పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత భూపెన్ బోరా..
- బోరాను కలవనున్న సీఎం హిమంత బిశ్వ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అస్సాం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ బోరా రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామం తర్వాత అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ, బోరాను వ్యక్తిగతంగా కలువనున్నట్లు ప్రకటించారు. బోరా రాజీనామాపై హిమంత మాట్లాడుతూ.. ‘‘ భూపెన్ బోరా అస్సాం కాంగ్రెస్ లో అట్టడుగు స్థానం నుంచి ఎదిగిన ప్రముఖ హిందూ నేత. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం ఆయనను కలవనున్నాను. బీజేపీలో ఆయన చేరితే అస్సాం, దేశ సేవలో మరింత బలం చేకూరుతుంది’’ అని అన్నారు.
Read Also: Valentine’s Day Shocker: భార్యతో వాలెంటైన్స్ డే డిన్నర్, రాత్రి మర్డర్..
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
అస్సాం కాంగ్రెస్ చీఫ్‌గా గౌరవ్ గొగోయ్ బాధ్యతలు తీసుకునే ముందు 2021-25 వరకు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోరా పనిచేశారు. ప్రస్తుతం, అస్సాం కాంగ్రెస్‌లో గొగోయ్ ఆధిపత్య ధోరణి కారణంగానే బోరా రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. బోరా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. 32 ఏళ్లగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ఇప్పుడు విస్మరించారని, తనకు తగిన గౌరవం కల్పించలేదని ఆయన ఆరోపించారు.
బోరా రాజీనామా ద్వారా కాంగ్రెస్‌లో సాధారణ వ్యక్తి అభివృద్ధి చెందలేదనే సందేశాన్ని పంపిందని, బోరాను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని, బీజేపీలో చేరాలని నిర్ణయించుకుంటే ఆయనకు సురక్షిత స్థానం నుంచి ఎన్నికయ్యేలా చేస్తామని హిమంత చెప్పారు. సీఎం హిమంత తనను కలుస్తాననే వ్యాఖ్యలపై బోరా స్పందిస్తూ.. ఏ ముఖ్యమంత్రి అయినా తన ఇంటికి వస్తే అది తనకు గర్వకారణం అని బోరా అన్నారు. ఇదిలా ఉంటే, రాజీనామాపై పునరాలోచన చేయాలని గొగోయ్, ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్, దేబబ్రత సైకియాతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?