బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కె.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ వన్ నుండి మొదలైన బైక్ ర్యాలీ 9వ ఫేస్ వరకు కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి మద్దతుగా నిలుస్తూ అడుగున అడుగున…
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో ఆయన తరుఫున కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాగిడి లక్ష్మారెడ్డితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్‌ఎస్ అభ్యర్థిని నివేదిత పాల్గొన్నారు.
CM Revanth Reddy: ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజ్ గిరిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొననున్నారు.
శుక్రవారం రోజు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పర్వతనగర్, వివేకానంద నగర్, తులసినగర్, గాయత్రి నగర్, జనప్రియ నగర్‌లో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేంధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.. నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.