CM Revanth Reddy: ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజ్ గిరిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మల్కాజ్ గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
Read also: Kenya Floods : కెన్యాలో వరదల విధ్వంసం.. 70 మంది మృతి.. భారీ వర్ష సూచన
ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో జాతీయ పార్టీ నేతల ప్రచారంతో పాటు రాష్ట్ర నేతల ప్రచారంపైనా త్వరలో నేతలతో చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం పద్నాలుగు సీట్లు గెలుచుకునేందుకు అన్ని రకాల వ్యూహాలు రచించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలకు ధీటైన సమాధానం చెబుతూ.. ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. ఇటీవలే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 14 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Dulam Nageswara Rao: దూలం నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన చిన్న కోడలు..