26/11 ముంబై దాడులలో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఎ ప్లస్ యస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ‘మేజర్’ చిత్రం ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే… ఈ యేడాది చివరి రోజున ‘మేజర్’ సినిమా హిందీ వర్షన్ డబ్బింగ్ ప్రారంభించాడు హీరో అడివి శేష్. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న…
కరోనా మరోసారి విజృభిస్తుంది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అని ఆనందించేలోపు కేసులు ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ నటి. “హమ్”, “ఖుదా గవా” మరియు “ఆంఖేన్” వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు. శిల్పాకు…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని…
సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది అభిమానులకు విందు భోజనమే సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి కాంబోలో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకొనేలోపు .. మహేష్- త్రివిక్రమ్ తో కాంబో సెట్ చేసేశాడు. అతడు, ఖలేజా తరువాత…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. “సర్కారు వారి పాట” సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, భారీ పోటీ కారణంగా వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న విడుదలకు…
టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ కుటుంబానికి పంపిస్తుంటారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే…
ఏపీ సీఎం జగన్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం జగన్కు…
ప్రిన్స్ మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార లకు తాతయ్య కృష్ణ అంటే ఎంతో అభిమానం. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉండకపోయినా, తరచూ జరిగే ఫ్యామిలీ గేదరింగ్స్ లో అంతా కలుస్తూ ఉంటారు. ఇక బర్త్ డేస్, స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ లో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో కృష్ణ కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. లేదంటే ఆ పనిని కృష్ణ చిన్నల్లుడు,…
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్కు ఏకంగా సూపర్స్టార్ మహేష్బాబు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సర్జరీ జరిగింది… ప్రస్తుతం ఆయన దుబాయ్లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, మహేష్ ఆరోగ్యంపై గత కొంతకాలంగో సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది… మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని ప్రచారం సాగింది.. తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో.. మహేష్ మోకాలికి చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది.. తీవ్రమైన నొప్పితో బాధపడుతోన్న మహేష్.. వైద్యులను సంప్రదించగా.. సర్జరీ అవసరమని…