సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాతో పాటు మహేష్ కు జరిగిన చిన్న సర్జరీ కారణంగా కొన్ని రోజులు షూటింగ్ ను పక్కన పెట్టేశారు టీం. తాజాగా అప్డేట్ ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అలాగే ఫిబ్రవరి 2 నుంచి మహేష్ బాబు సెట్స్‌పైకి రానున్నాడు. ఇక “సర్కారు వారి పాట” షూటింగ్ మొత్తం మార్చి నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది.
Read Also : షెకావత్ సారూ.. మీ భార్య భలే స్టైలిష్ గా ఉన్నారే
మరోవైపు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌ని విడుదల చేయనున్నారు. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ఉండబోతున్న ఈ పాట ఫిబ్రవరి 14న విడుదల కానుంది. కాగా “సర్కారు వారి పాట”కు పరశురామ్ దర్శకత్వం వహించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు సహాయక తారాగణంగా కనిపిస్తారు. ఈ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించనున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది.