ఈరోజు ఓటిటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో చూద్దాం.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో మహేష్ బాబు చేసిన సందడి ఈ రోజు నుండి ఆహా వీడియోలో అందుబాటులో ఉంటుంది.
లూప్ లాపేట
1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది.
Read Also : ‘లైగర్’ అప్డేట్… పిక్ షేర్ చేసిన ఛార్మి
ది గ్రేట్ ఇండియన్ మర్డర్
వికాస్ స్వరూప్ ప్రసిద్ధ నవల సిక్స్ సస్పెక్ట్స్ ఆధారంగా రూపొందించిన మిస్టరీ సిరీస్ ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’. ఇందులో ప్రతీక్ గాంధీ, రిచా చద్దా డిటెక్టివ్‌లుగా నటించారు. పేరు మోసిన పారిశ్రామికవేత్త హత్య మిస్టరీని ఛేదించడమే కథ. డిస్నీ+హాట్‌స్టార్ లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
రాకెట్ బాయ్స్
డాక్టర్ హోమీ జె భాబా వంటి మార్గదర్శకులు జీవించిన భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కథ ఇది. హోమీ భాబా పాత్రను జిమ్ షర్బ్ పోషించారు. ఇష్వాక్ సింగ్ మరొక చారిత్రక వ్యక్తి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను పోషించారు. అభయ్ పన్ను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. సోనీ LIV లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.