సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు మహేష్. “ఎవరు మీలో కోటీశ్వరులు” గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు మహేష్ తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. గేమ్…
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేశారు. షోలో మహేష్, ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వినోదభరితమైన ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే రాబట్టాడు ఎన్టీఆర్. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. ఈ స్పెషల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా, ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్‌ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ గేమ్ షో హోస్ట్, మహేష్ అతిథిగా బుల్లితెరపై ప్రేక్షకులకు…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో అయినా, యాడ్స్ తో పాటు బుల్లితెర షోలు అయినా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. వెండితెర ప్రిన్స్ మహేష్ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కనిపించడానికి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకవైపు బాలయ్యతో “అన్‌స్టాపబుల్” అంటూనే, మరోవైపు ఎన్టీఆర్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా నెక్స్ట్ లెవెల్ ఎంటెర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ డిసెంబర్ 5న జెమినీ టీవీలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వీకెండ్ మస్తీని ఎంజాయ్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. మహేష్, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ శనివారం రాత్రి తమ స్నేహితులతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. రుచికరమైన ఆహారం, సరదా సంభాషణతో శనివారం సాయంత్రం మంచి సమయాన్ని గడిపాక స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ లో మహేష్ బాబు “మహర్షి” దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో మహేష్ కు…
సినీ సెలెబ్రెటీలకు తమ సినిమాల్లో నవరసాలూ పలికించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం తమ పిల్లలు వాళ్ళు చేసే కొన్ని సన్నివేశాలను చూడడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలు కూడా సినిమాల్లో తమ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరపై చూడటానికి ఇష్టపడరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తండ్రి సినిమాల్లో అలాగే కొన్ని సీన్లను చూడడానికి అస్సలు ఇష్టపడదట. Read Also : ‘అఖండ’ చూస్తూనే ఆగిన…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి.…
తెలుగు స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేశ్ బాబు చేస్తునన్ని వాణిజ్య ప్రకటనలు మరే స్టార్ హీరో చేయడం లేదు. ఆ మధ్యలో ‘అతిథి’ సినిమా తర్వాత మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. 2007 అక్టోబర్ లో ‘అతిథి’ విడుదలై పరాజయం పొందాక, సినిమా నటనకు దూరంగా ఉన్న మహేశ్ కేవలం యాడ్స్ నటిస్తూనే మూడేళ్ళు గడిపేశాడు. అతని అభిమానులకు అవే కాస్తంత ఓదార్పును కలిగించాయి. ‘అతిథి’ వచ్చిన మూడేళ్ళకు గానీ ‘ఖలేజా’ మూవీ రిలీజ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. గతంలో భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానులను వీరు అలరించారు. తాజాగా జెమినీటీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 5న ఆదివారం రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు. నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత…