గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ ( 89 ) ఇవాళ ( మంగళవారం ) తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొల్హాపూర్ కు వచ్చిన అరుణ్ గాంధీ.. అక్కడే పది రోజుల పాటు బస చేయాలని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరే కంటే ముందే అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
Bereaved. Lost my father this morning🙏🏽
— Tushar बेदखल (@TusharG) May 2, 2023
Also Read : Sharukh Khan: నెలలో రిలీజ్ ఉంది, అప్డేట్ ఇవ్వండ్రా బాబు…
ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ప్రయాణాలు చేయవద్దని డాక్టర్లు సూచించడంతో అరుణ్ గాంధీ అక్కడే ఉండిపోయారని..దీంతో ఈ రోజు ఉదయమే ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా అరుణ్ గాంధీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. కాగా, మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్ గాంధీ, సుశీల మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ ఏప్రిల్ 14,1934లో డర్భన్ లో జన్మించాడు. అరుణ్ గాంధీ సామాజికి కార్యకర్తగా, రచయితగా తన తాత అడుగుజాడల్లోనే నడిచారు.
Also Read : Sharad Pawar : ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా
ఇక, అరుణ్ గాంధీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం కొల్హాపూర్ జిల్లాలోని వాషి నంద్వాల్ లో నిర్వహించనున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ కొల్హాపూర్ కు బయలుదేరారి వెళ్లారు. ఈ మేరకు ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.