Maharashtra: ప్రస్తుతం సోషల్ మీడియాలు చిన్నారులపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీ తెలియన ప్రాయంలో స్నేహం, లవ్ వంటివి మైనర్లను ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 11 ఏళ్ల బాలికకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిపి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చేలా సదరు బాలికను నిందితుడైన వ్యక్తి ప్రేరేపించాడు.
Read Also: Ambati Rambabu: టీడీపీ మోసాలకు పాల్పడే పార్టీ.. నన్ను ఓడించేందుకు కొత్త వస్తాదుల్ని తెస్తున్నారు
ఈ క్రమంలో సదరు బాలిక డిసెంబర్ 24, 2021లో యూపీ గోరఖ్ పూర్ నుంచి అదృశ్యమైంది. మహరాష్ట్ర లాతూర్‌లోని ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురే బాలికను ఉత్తర్ ప్రదేశ్ నుంచి లాతూర్ తీసుకెళ్లాడు. గత ఏడాదిన్నరగా బాలికను నిర్భందించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కుటుంబ సభ్యులు గదిలో వెతుకుతుండగా.. రెండు నెంబర్లు దొరికాయి.
ఇందులో ఒక నెంబర్ కు ఫోన్ చేయగా.. నిందితుడు తనను తాను హైదరాబాద్ కు చెందిన షేక్ గా పరిచయం చేసుకుని, 11 ఏళ్ల అమ్మాయి తన వద్దే ఉందని, ఆమె ఇంటికి తిరిగిరాదని ఆమె కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. ఆమె గురించి మరిచిపోవాలని సలహా ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మొబైల్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి నిందితుడు మనుద్దీన్ బాదురేని లాతూర్ లో అరెస్ట్ చేశారు. బందీగా ఉన్న బాలికను రక్షించారు. లాతూర్ బందీ ఉంచడానికి ముందు మనుద్దీన్ గోరఖ్ పూర్ లో నివిసించేవాడని పోలీసులు వెల్లడించారు. యూపీ పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.