టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు, మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను రుతు గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుత్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా వీరిద్దరూ తమ పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Uttarapradesh: ఛీ.. ఛీ.. నువ్వు అస్సలు తల్లివేనా.. ముగ్గురు పిల్లలను చంపి…
ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ లో రుత్ రాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్-2023 చాంపియన్‌గా నిలిచిన తర్వాత సీఎస్‌కే ఆటగాళ్లు తమ భాగస్వాములతో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో రుతురాజ్ కూడా ఉత్కర్షతో కలిసి ఫోటోలు దిగాడు. అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ధోనితో కూడా ఫోటో దిగడంతో ఈ జంట వార్తల్లో నిలిచింది. కాగా రుతురాజ్ గైక్వాడ్ మాదిరే ఉత్కర్ష సైతం క్రికెటర్ కావడం విశేషం.
Also Read: Odisha Train Accident: ముగిసిన రెస్య్కూ ఆపరేషన్.. ట్రాక్ పునరుద్ధరణ పనులు స్టార్ట్
ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణేలో జన్మించింది. మహారాష్ట్ర తరఫున దేశవాలీ క్రికెట్ కూడా ఆమె ఆడింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఆమె 5 వికెట్లు తీసుకుంది. క్రికెట్‌పై ఆసక్తితో ఉత్కర్ష 11 ఏళ్ల నుంచే గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె.. పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్సెస్ విద్యను అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రుత్‌రాజ్ గైక్వాడ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.