Man Stabs Brother: ఈ రోజుల్లో ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వాళ్లను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు కొంత మంది దుర్మార్గులు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసుకుంది. నవీ ముంబైలో తన తమ్ముడు దాడి చేసిన తర్వాత 32 ఏళ్ల వ్యాపారవేత్త మెడలో కత్తితో తన మోటార్‌సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. బాధితుడు తేజల్ పాటిల్‌కు సిరలు, ధమనుల నుంచి ఆయుధం తప్పిపోవడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు.
Read Also: Kerala High Court: నగ్నత్వాన్ని అశ్లీలతతో ముడిపెట్టకండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
తేజల్ పాటిల్ సెక్టార్ 5 సంపాడలోని తన ఇంట్లో నిద్రిస్తుండగా.. అతని సోదరుడు మోనిష్(30) జూన్ 3న అతని మెడపై కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మోనిష్ కత్తితో పొడిచిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. విపరీతమైన నొప్పి, రక్తస్రావం ఉన్నప్పటికీ తేజస్ తన ద్విచక్రవాహనంపై ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించి దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేశారు. మోనిష్‌తో పాటు అతని స్నేహితులలో ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.