మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో బస్సును, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు..
నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్నా ప్రయానికులతో బస్సును గమనించలేదు..దాంతో బస్సును చాలా వేగంగా వచ్చి ఢీ కోట్టింది..ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడికే మృతి చెందారు..ఒక చిన్నారి, మహిళ ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.. దాంతో మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా కష్ట పడ్డారు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చాలా కష్టపడ్డారు..ఈ ప్రమాదం గాయపడిన మహిళను, చిన్నారి తొలుత నాగ్‌భిడ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసు అధికారి చెప్పారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహిళా మృతిచెందగా, చిన్నారిని మెరుగైన వైద్యం కోసం నాగపూర్ కు తరలించారు.. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..