MLA And Engineer: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఎక్కువ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు వారి సొంత పనుల నేపథ్యంలో ఇటువంటివి చేస్తుంటారు. కానీ ఒక మహిళా ఎమ్మెల్యే మాత్రం పేదల ఇళ్లను కూల్చివేసిన అధికారులపై చేయిచేసుకున్నారు. అది సరైన చర్య కాదని తెలుసునని.. అయినప్పటికీ తాను చేయాల్సి వచ్చిందని.. తాను న్యాయపరంగా కూడా దానిని ఎదుర్కొంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Read also: Arjun Daggupati : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వెంకటేష్ తనయుడు…?
మహారాష్ట్ర లోని ఠానే జిల్లా మీరా భయందర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ . జూనియర్ సివిల్ ఇంజినీర్ కాలర్ పట్టుకుని చెంప వాయించారు. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొన్ని నిర్మాణాలను కూల్చివేయడంతో వర్షాకాలం ముందు చిన్నారులతో పాటు మరికొందరు రోడ్డున పడ్డారంటూ ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ అక్కడ ఉన్న ఇద్దరు ఇంజినీర్లను ఎమ్మెల్యే నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ సివిల్ ఇంజినీర్‌పై ఆమె చేయిచేసుకున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read also: Salaar: స్నేహం కోసం ప్రాణం తీసే హీరో కథ…
నిర్మాణాలు కూల్చివేయడంతో చాలా మంది రోడ్డున పడితే అధికారులు నవ్వుకోవడం చూసి తాను భరించలేకపోయానని ఎమ్మెల్యే అన్నారు. బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటుంటే అధికారి నవ్వడం చూసి నేను నియంత్రణ కోల్పోయానని.. తమ ఇంటిని కూల్చివేయడం చూసి మహిళలు ఏడుస్తుంటే సంబంధిత అధికారి వారిని చూసి నవ్వుతున్నారని మండిపడ్డారు. తన చర్య అతనికి సహజమైన ప్రతిచర్య అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే తన చర్య చట్టవిరుద్దమేనని అంగీకరించారు. జూనియర్ సివిల్ ఇంజనీర్లు ధ్వంసం చేసిన ఇంటిలో కొంత భాగం మాత్రమే చట్టవిరుద్ధమని, దాని నివాసులు తొలగిస్తామని హామీ ఇచ్చారని జైన్ చెప్పారు. అక్రమ నిర్మాణం బిల్డర్‌కు అడ్డంకిగా ఉంది.. ఏ ప్రభుత్వ సౌకర్యానికి లేదా రహదారికి కాదని.. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్లి, అక్రమ భాగాన్ని కూల్చివేయడానికి బదులుగా వారు మొత్తం ఇంటిని ధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Video Call: ఆమెకు 20.. ఆయనకు 79.. న్యూడ్ వీడియో కాల్.. కట్ చేస్తే!
చట్టపరమైన లేదా చట్టవిరుద్ధమైన ఇంటిని ముందుగానే లేదా వర్షాకాలంలో కూల్చివేయకూడదని సూచించే ప్రభుత్వ తీర్మానాన్ని ఎమ్మెల్యే జైన్ ప్రస్తావించారు. తాను ఈ తీర్మానం గురించి అధికారులకు చెప్పానని.. 5 రోజుల క్రితం ముందుకు వెళ్లొద్దని అధికారులను కోరినట్టు గుర్తు చేశారు. ఈ ఆర్డర్ ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి అమలులోకి వస్తుందని.. అయినప్పటికీ వారు ముందుకెళ్లి కొన్ని రోజుల కిందట ఇళ్లను కూల్చివేశారని పేర్కొన్నారు. తమ ఇంటి కూల్చివేతను వ్యతిరేకిస్తున్న మహిళలను జుట్టు పట్టుకుని అధికారులు లాగారని జైన్ ఆరోపించారు. ఇద్దరు ఇంజనీర్లు బిల్డర్ల సహకారంతో ప్రైవేట్ స్థలంలో కూల్చివేత పనులు చేపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అంశాన్ని తాను అసెంబ్లీలో లేవనెత్తుతానని.. తనపై ఇంజనీర్ (చెంపదెబ్బ తిన్న ఇంజనీర్) కేసు పెట్టనివ్వండి. దానిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మున్సిపల్ అధికారులు ప్రైవేట్ భూమిలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడాన్ని ఎలా సహించగలమని ఎమ్మెల్యే ప్రశ్నించారు.