Rabies: కుక్కకాటు తర్వాత రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ యువతి కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మూడు రోజుల తర్వాత రేబిస్‌తో మరణించింది. అత్యంత అరుదుగా జరిగిన ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు.
Read Also: FASTag: మార్చి15 లోగా ఇతర బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్‌కి మారాలి.. పేటీఎం యూజర్లకి హైవే అథారిటీ సూచన
కొల్హాపూర్‌కి చెందిన 21 ఏళ్ల మహిళ సృష్టి షిండే రేబిస్ వ్యాక్సిన్ కోర్సు పూర్తైన తర్వాత మరణించారు. టీకా తీసుకున్న మూడు రోజుల తర్వాత ఆమె రేబిస్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఫిబ్రవరి 3న భౌసింగ్ జీ రోడ్డులో సృష్టి షిండే కుక్క కాటుకు గురయ్యారు. ఫోన్ మాట్లాడేందుకు ఆగిన సమయంలో వీధి కుక్క ఆమెను కరిచింది. వెంటనే ఆమె ర్యాబిస్‌కి వ్యతిరేకంగా టీకాను తీసుకుంది. మొత్తం 5 డోసులు తీసుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు. అయితే, రెండు రోజుల తర్వాత ఆమెకు జర్వం రావడంతో పాటు రెండు కాళ్లకు బలం తగ్గిపోయింది.
ఆస్పత్రిలో చేరిన సృష్టి షిండేకు అనేక పరీక్షలు నిర్వహించి రేబిస్ ఉన్నట్లు తేల్చారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. తదుపరి చికిత్స కోసం షిండేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మరుసటి రోజే మరణించింది. వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసినప్పటికీ, ఎలా మహిళ మరణించిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. టీకాను అవసరమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచారా..? లేదా.? అని కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు.