Nagpur Bus Driver: చేతికి బుల్లెట్ గాయం.. 30 కిమీ బస్సు నడిపిన డ్రైవరు! 35 మంది సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఓ మినీ బస్సు డ్రైవరు పెద్ద సాహసం చేశాడు. దోపిడీ దొంగల కాల్పుల్లో చేతికి బుల్లెట్ తగిలినా.. బస్సును ఆపకుండా 30 కిమీ నడిపి సురక్షితంగా పోలీస్‌స్టేషకు చేరుకున్నాడు. దాంతో దాదాపు 35 మంది ప్రయాణికుల ప్రాణాలను మినీ బస్సు డ్రైవర్ రక్షించాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై షెగావ్ సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవరు చూపిన తెగువతో తాము దోపిడీ దొంగలకు బారినుంచి సురక్షితంగా బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు.
డ్రైవరు ఖోమ్‌దేవ్ కవాడే మాట్లాడుతూ… ‘అమరావతి ఆలయాన్ని దర్శించుకొని షేగావ్ నుంచి నాగ్‌పుర్‌కు తిరుగుప్రయాణం అయ్యాము. వెనుక ఓ బొలెరో కారు బస్సును వెంబడించింది. బస్సును ఓవర్‌టేక్ చేస్తారేమో అని రెండుసార్లు దారి ఇచ్చినా.. కారు ముందుకు వెళ్ళలేదు. దుండగులు మళ్లీ బస్సు వెనక్కే వచ్చారు. అది యూపీ కారు. కొంతసేపటికి బస్సు ముందుకు వచ్చిన దుండగులు.. కారులో నుంచే కాల్పులు జరిపారు. బస్సుపైకి నాలుగు రౌండ్స్ కాల్పులు జరిపారు. మొదటిసారి తప్పించుకోగలిగినా.. రెండోసారి నా చేతిపై కాల్చారు. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే 30 కిమీ బస్సు నడిపా’ అని తెలిపాడు.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఖోమ్‌దేవ్ కవాడే చేతికి రక్తస్రావం అవుతున్నా నాగ్‌పూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాడి గ్రామంలో దుండగులను తప్పించుకుని.. 35 మంది ప్రయాణికులను టియోసా పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా బస్సులో తీసుకొచ్చాడు. పోలీసులు బస్సును తిరిగి నందగావ్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. డ్రైవర్‌ను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దుండగుల సమాచారం కోసం నాగ్‌పూర్ సమీపంలోని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కారు నాగ్‌పూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!