Nithya Pellikoduku: దేశవ్యాప్తంగా 20కి పైగా వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల్ని నమ్మించి పెళ్లి చేసుకుని వారి నగలు, ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
Sharad Pawar: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు.. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అబద్దాలు చెప్పారు.
ఓ గ్యాంగ్స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలై.. తిన్నగా ఇంటికి వెళ్లకుండా.. ఎక్స్ట్రాలకు పోయి తిరిగి చెరసాలకు వెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూణెలోని లావాసా నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా.. ఓ యువకుడు మృతి చెందాడు. కాగా కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వర్షం కారణంగా పూణె, థానేలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. డ్యామ్లలో నీటిమట్టం పెరిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలను రక్షించే పనిలో…
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ టార్గెట్గా ఆయన పలు ఆరోపణలు చేశారు.
Tattoo artist: మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ముర్తిజాపూర్ పట్టణంలో అస్సాంకు చెందిన 26 ఏళ్ల మహిళా టాటూయిస్ట్ తలకు గాయాలై మృతి చెందింది. ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన లవర్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ హోంమంత్రి దేశ్ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మరో ముగ్గురు ‘మహా వికాస్ అఘాడీ’ నేలపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తనపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Maharashtra: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. 288 స్థానాలు ఉన్న మహా అసెంబ్లీలో బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) పార్టీలు ‘మహాయుతి’ పేరుతో కూటమిగా పోటీ చేయబోతున్నాయి.