కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ముంబైలోని థానేలో ఇద్దరు బాలికలను వేధించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలాగే ఇప్పుడు ముంబైలోనూ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై ఓ స్వీపర్ ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పెను దుమారం చెలరేగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ…
Murder Attack: తల్లికి తన బిడ్డల కంటే ఏదీ ముఖ్యం కాదు. పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతి ఆపదను ఎదుర్కొనే ధైర్యం తల్లికి ఉంటుంది. మహారాష్ట్రలో పట్టపగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ సమయంలో అతని తల్లి ధైర్యంగా త్వరగా స్పందించి తన కొడుకు ప్రాణాలను కాపాడింది. కొల్హాపూర్ లోని జైసింగ్ పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ షాకింగ్…
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి,
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 80 మంది విద్యార్థులు పోషకాహార కార్యక్రమం కింద బిస్కెట్లు తిని ఆసుపత్రిలో చేరారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులకు వికారం, వాంతులు వచ్చాయి.
వెల్లుల్లి చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. ఇది రుచే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ప్రస్తుతం వెల్లుల్లి ధర పెరిగింది. దీంతో మార్కెట్లోకి నకిలీ వెల్లుల్లి వస్తోంది.
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. శుక్రవారం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల సంఘం ప్రత్యేక సన్నాహాలు చేసింది.
జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Robbery: మహారాష్ట్రలోని పూణెలో కేబుల్స్ దొంగిలించడానికి విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు పడిపోవడంతో మరణించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాతిపెట్టారు. విషయం తెలియగానే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరణించిన యువకుడి పేరు బసవరాజ్ మంగ్రుల్ (22). అతను పూణెలోని సింగఢ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Minister Seethakka: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయం.. వైద్యులకు…