ఓ విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించి, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు స్కూల్ స్వీపర్. ఈ ఘటన మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 8 నెలల క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విగ్రహం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విగ్రహాన్ని గతేడాది నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని ఓ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం కుప్పకూలింది. దీన్ని గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రస్తుతం విగ్రహం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటనేది నిర్ధారణ కాలేదు.
బాలల సంక్షేమ కమిటీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఆ అమ్మాయిలు కాల్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ కమిటీ సభ్యులు మంగళవారం అకోలాలోని స్కూల్ కు వచ్చి, వారితో మాట్లాడాగా.. దాని తర్వాత వేధింపుల అభియోగాల కింద సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.
Road Rage Video: మహారాష్ట్ర థానే జిల్లా అంబర్నాథ్ లో రోడ్డు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఇందులో టాటా సఫారీ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా మరో కారును ఢీకొట్టాడు. దీని తరువాత, ఒక వ్యక్తి వాహనంలో ఇరుక్కుపోవడంతో అతన్ని చాలా సేపు బయటికి లాగడం కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారు రైడర్ తన కారుతో ఐదుగురిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,…
Huge Fire Accident: మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రి చించ్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో సదరు ప్రాంతంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే…