Gas Leak: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. అల్లాడుతున్న ప్రజలు..
- మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.
- నగరం అంతటా రసాయన పొగ.
- అల్లాడుతున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Leak: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడం కలకలం సృష్టించింది. నగరం అంతటా రసాయన పొగ వ్యాపించింది. ప్రజలు తమ కళ్లలో మంట, గొంతు నొప్పిని అనుభవిస్తున్నారని సమాచారం. నగరం అంతటా పొగలు వ్యాపించడంతో అక్కడ పట్టపగలే ఏమి కానరాకుండగా పరిస్థితి మారింది. థానే అగ్నిమాపక దళం ప్రకారం, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రజలు కళ్లలో మంట, గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది. అధికారుల ప్రకారం, గురువారం అర్థరాత్రి (సెప్టెంబర్ 12, 2024) అంబర్‌నాథ్ లోని ఒక రసాయన కంపెనీలో గ్యాస్ లీకేజీ నమోదైంది. ఈ ఘటన తర్వాత గ్యాస్ ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
YSRCP: చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు.. మాజీ మంత్రికి కీలక బాధ్యలు..!
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
అంబర్‌నాథ్ అగ్నిమాపక దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌నాథ్‌లో ఓ రసాయన కంపెనీ గ్యాస్ తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. అంబర్‌నాథ్ లోని మోరివలి ఎంఐడీసీలోని ఓ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయినట్లు వార్తలు వచ్చినట్లు అధికారులు తెలిపారు . ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయి. గ్యాస్ స్వభావం, లీక్‌కు కారణాన్ని గుర్తించడానికి పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు, మృతి చెందినట్లు సమాచారం లేదు. ఈ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!