Cloud kitchens In Indian Railways: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుండి ఆహారం విషయంలో తరచుగా ఫిర్యాదులు వస్తూ వుంటాయి. ముఖ్యంగా సుదూర రైళ్లలో ఆహారం నాణ్యతపై సందేహాలు తలెత్తడం సర్వసాధారణం. అయితే, ఇప్పుడు భారతీయ రైల్వే ఒక పరిష్కారాన్ని కనుగొంది. IRCTC రైలు బేస్ కిచెన్‌ను ఇకపై క్లౌడ్ కిచెన్‌గా మార్చడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది. 200 క్లౌడ్ కిచెన్లు నిర్మించనున్నారు: IRCTC గత నెల నుండి కొన్ని రైళ్లలో క్లౌడ్…
కడుపు నిండా తిని.. బిల్లు చెల్లించమన్న పాపానికి ఓ వెయిటర్ పట్ల కస్టమర్లు దుర్మార్గంగా ప్రవర్తించారు. వెయిటర్‌ను కారులో కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ హోటల్ దగ్గర చేటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AIMIM In Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలు తమ పంతం పట్టాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ మహారాష్ట్రలో ప్రకటించారు. తన ఐదుగురు అభ్యర్థుల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. దీంతో పాటు సవరణ బిల్లును వ్యతిరేకించాలని అజిత్ పవార్‌ను కూడా కోరారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగాబాద్ లోక్‌సభ మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభ్యర్థిగా…
Quarrel with wife: తన భార్యతో గొడవ పడిన 45 ఏళ్ల వ్యక్తి పూణేలోని పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనూహ్యంగా అతను 8 గంటల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక దళాలు గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించిన అతడి ఆచూకీ లభించలేదు, చివరకు నదిలోని పొదలల్లో వేలాడుతున్న స్థితిలో కనిపించాడు.
Maharashtra: మహారాష్ట్ర ఆహార- ఔషధ నిర్వహణ శాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్) సీనియర్ నేత ధర్మారావుబాబా ఆత్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహం’’ చేసినందుకు తన కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పారేయాలని అహేరి నియోజకవర్గ ఓటర్లు కోరారు. వీరిద్దరు శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఈ వ్యాఖ్యలుచేశారు.
Crime: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉందని శుక్రవారం పోలీసులు తెలిపారు. బద్లాపూర్‌లోని షిర్గావ్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో బుధ, గురువారాల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Maharashtra: మహారాష్ట్రలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో విషాదకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిడ్డలు విషజ్వరాలతో మరణించడంతో వారి శవాలను భుజాలపై వేసుకుని 15 కి.మీ నడిచి సొంత ఊరికి చేరారు.