Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టి ( గురువారం) నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.
పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం రోజుల్లోనే ఉల్లి ధర కిలో రూ.10 పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణం.
Eknath Shinde: సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు గుప్పిస్తోంది.
Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఏక్నాథ్ షిండే-బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)ల సర్కార్ ‘మహాయుతి’పై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ శరద్ పవార్)ల కూటమి విరుచుకుపడుతోంది. ఈ రోజు ఎంవీఏ కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. విగ్రహం కూలిపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
Maharashtra: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహరాష్ట్రాలోని కొల్హాపూర్‌లో జరిగింది.
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్‌లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాల్ఘర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంతో మీ మనసులు గాయపడ్డాయని తనకు తెలుసన్నారు.
Maharastra : మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ చేతన్ పాటిల్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాని మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అయినా కూడా అబలలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు.