Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. 99 మందితో తొలి లిస్ట్‌ని విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులోనే డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు అశోక్ చవాన్ కూతురి పేర్లు ఉన్నాయి. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు.
దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది.
రెండు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు మళ్లీ ప్రచారానికి దిగాయి. దళితుల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న (బుధవారం) జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. అయితే వారం మధ్యలో (బుధవారం) పోలింగ్ ఎందుకు పెట్టారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది.
హర్యానాలో ఎదురైన పరిస్థితులు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎదురవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇంకా షెడ్యూల్ రాక ముందే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులను అధిష్టానం నియమించింది.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇగత్పురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే హిరామన్ భికా ఖోస్కర్ అజిత్ పవార్ నేతృత్వంలోని-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
Election Commission: జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగబోతుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం3.30 గంటలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను తెలిపనుంది.