జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత, ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. సోమవారం గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై జార్ఖండ్‌లోని అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే.. ఈ ప్రధాని ప్రసంగంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, కాపీయింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవడం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాల గురించి ప్రధాని నేరుగా మాట్లాడటం చాలా అరుదు.
READ MORE: Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో సంజయ్‌రాయ్‌పై అభియోగాలు.. 11 నుంచి విచారణ
నిరుద్యోగ సమస్యకు సమాధానం..
జార్ఖండ్‌లో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రధాని మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వస్తే 3 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నిజానికి.. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ బీజేపీని నిరంతరం కార్నర్ చేస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ విషయంపై ప్రసంగించడం ఆసక్తి రేపుతోంది. జార్ఖండ్ యువతలో ప్రతిభకు కొదవ లేదని ఆయన అన్నారు. జార్ఖండ్‌కు చెందిన కుమారులు, కుమార్తెలు క్రీడారంగంలోస్ఫూర్తిని చాటుతున్నారని కొనియాడారు. జార్ఖండ్ యువతలో సామర్థ్యాలను పెంచడం, వారికి కొత్త అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కానీ జేఎమ్‌ఎమ్, కాంగ్రెస్, ఆర్‌జేడీలు జార్ఖండ్ యువతకు ద్రోహం చేశాయని ఆరోపించారు.