Maharashtra Election: నేటి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తర మహారాష్ట్రలోని ధూలేలో తొలి ర్యాలీ తీయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నాసిక్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు అకోలాలో.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే, చిమూర్ (చంద్రాపూర్ జిల్లా), షోలాపూర్‌లలో జరిగే ర్యాలీలలో సైతం మోడీ ప్రసంగిస్తారు.
Read Also: Rajanna Sircilla: మహారాష్ట్ర ముఠా నిర్వాకం.. కూలీలను పంపించలేదని తల్లి కిడ్నాప్
కాగా, నవంబర్ 12వ తేదీన పూణేలో నిర్వహించే రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొంటారు.. ఆ తర్వాత నవంబర్ 14న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్, రాయ్‌గఢ్, ముంబైలో మూడు చోట్ల ర్యాలీల్లో మోడీ ప్రసంగిస్తారు. బారామతి నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించాల్సిందిగా తాను ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించలేదని.. అందుకే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. కాగా, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు, మహావికాస్ అఘాడి సైతం ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తుంది.