Ajit Pawar: సీఎం యోగి ‘‘బాటేంగే’’ నినాదం మహారాష్ట్రలో పనిచేయదు..
- యోగి నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మహారాష్ట్రలో పనిచేయదు..
- మిత్రపక్షం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది.
Read Also: Amit Shah: మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఏక్‌నాథ్ షిండే కాదు.. సీఎం అభ్యర్థి ఎంపికపై షా కీలక ప్రకటన
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
బీజేపీ మహాయుతి కూటమిలో మిత్రపక్షమైన ఎన్సీపీ యోగి నినాదంపై విమర్శలు చేస్తోంది. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ నినాదాన్ని ఖండించారు. ఇది రాష్ట్రంలో పనిచేయదని పేర్కొన్నాడు. ఎన్నికల్లో అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలని సూచించాడు. “నేను ఈ నినాదాన్ని ఆమోదించను. మహారాష్ట్రలో ఇది పనిచేయదని నేను పదేపదే చెప్పాను; ఇది ఉత్తరప్రదేశ్ లేదా జార్ఖండ్ వంటి ప్రదేశాలలో పనిచేయవచ్చు, కానీ ఇక్కడ కాదు.’’ అని అన్నారు.
ముఖ్యంగా ఈ నినాదం హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించడంతో పాటు భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ పరిస్థితిని, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని గురించి యోగి ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి తోడు ఇటీవల కాలంలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు కులగణన పేరుతో హిందువుల్లో విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ యోగి ఈ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ “ఏక్ హైన్ తో సేఫ్ రహేంగే” (మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అంటూ ప్రచారం చేస్తున్నారు.
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!