Maharashtra Assembly Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు వారి కోరిక మేరకు సీట్లు ఇవ్వడం ద్వారా బీజేపీ వచ్చేసారి అధికారంలోకి వస్తే అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేసింది.
Selfie With Elephant: ఒక యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాలను తీసింది. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో 23 ఏళ్ల వ్యక్తి ఏనుగుతో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.
Zeeshan Siddique: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో అజిత్ పవార్ వర్గంలో చేరినట్లుగా తెలుస్తుంది.
Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..?
Water Tank Collapse: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 24) పెను ప్రమాదం సంభవించింది. పింప్రి చించ్వాడ్ లోని భోసారి ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. అలాగే ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కార్మికులందరూ బీహార్, జార్ఖండ్ వాసులు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు కమిషనర్ వసంత్ పరదేశి స్పందించారు. ఓ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు…
Maharashtra NCP: నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి, ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్‌లో వెలుగులోకి వచ్చిన విశేషమేమిటంటే.. 95% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు దక్కడం. ఈ జాబితాలోని ప్రముఖ నాయకుల్లో…
Maharashtra Elections 2024: నవంబర్ 13న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పార్టీ శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉండగా.. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, రాజ్…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
మురికి కాలువలో రూ.500 నోట్లు కొట్టుకొచ్చిన ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో చోటుచేసుకుంది. మురికి కాలువలోని మురికి నీళ్లలో రూ.500 నోట్లు కనిపించడంతో జనాలు తొలుత వాటిని నకిలీ నోట్లుగా భావించారు. కానీ అవి నిజమైన నోట్లే అని తెలిశాక జనం ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. కాలువలోని మొత్తం చెత్తను తొలగించి మరీ రూ.500 నోట్ల కోసం వెతికారు.
RSS: మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహిస్తే, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ మధ్య పోరు నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఇటీవల హర్యానాలో ఎన్నికల్లో గెలుపు మహారాష్ట్ర బీజేపీలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అందరి కన్నా ముందుగా బీజేపీ 99 మందితో తన తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది.