మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి నిమిషంలో విచిత్రమైన ట్విస్ట్ జరిగింది. ఉపసంహరణ గడువుకు కొద్ది క్షణాల ముందు కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి షాకిచ్చింది. అనూహ్యంగా ఆమె కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఇది కూడా చదవండి: AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా మధురిమా రాజే ఛత్రపతి నామినేషన్ వేశారు. వాస్తవానికి తొలుత ఈ స్థానం నుంచి మాజీ కార్పొరేటర్ రాజేష్ లట్కర్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. అయితే 24 గంటల్లో కొల్హాపూర్ రాజ కుటుంబానికి చెందిన మధురిమా రాజే ఛత్రపతి పేరును భర్తీ చేశారు. దీంతో అసంతృప్తితో రాజేష్ లట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అతడు నామినేషన్ ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంట్లోనూ కనిపించలేదు. మొబైల్‌కి అందుబాటులోకి రాలేదు. దీంతో చేసేదేమీలేక నామినేషన్ ఉపసంహరణకు 5-10 నిమిషాలే ఉండడంతో మధురిమా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
ఇది కూడా చదవండి: Waqf Bill: ఇలా చేస్తే జేపీసీ నుంచి తప్పుకుంటాం.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపీలు..
ఎంపీ షాహూ ఛత్రపతి మాట్లాడుతూ.. నిస్సహాయతతోనే మధురిమా నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాజేష్ లట్కర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో తామే వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. పార్టీకి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొల్హాపూర్‌లో మహాయతి (శివసేన) అభ్యర్థిగా రాజేష్ క్షీరసాగర్.. స్వతంత్ర అభ్యర్థి రాజేష్ లట్కర్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari : తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది, కానీ మనం ఓపికగా ఉండాలి…