PM Modi: ‘‘ఐక్యంగా ఉంటేనే సురక్షితం’’.. కాంగ్రెస్‌పై పీఎం మోడీ ఫైర్..
- ఐక్యంగా ఉంటేనే సురక్షితం..
- కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతోంది..
- మహారాష్ట్ర ప్రచారంలో మోడీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ధులేలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తద్వారా ప్రతీ సామాజిక వర్గం అభివృద్ధి చెందే అవకాశాలను దెబ్బతీస్తోందని ప్రధాని పేర్కొన్నారు. “ఏక్ హైన్ టు సేఫ్ హైన్ (మీరు ఐక్యంగా ఉంటే మీరు సురక్షితం)” అని నినాదమిచ్చారు. మహాయుతి కూటమిని మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు.
Read Also: Putin: గ్లోబల్ సూపర్ పవర్స్‌లో భారత్‌కు అర్హత ఉంది..
Also Read
కాంగ్రెస్ ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టే ఆట ఆడుతోందని, దళితులు వెనకబడిన తరగతులు, గిరిజన వర్గాల జీవితాలు అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కి ఇష్టం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బిజెపి, శివసేన, ఎన్‌సిపి వర్గాలతో కూడిన మహాయుతి మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధికి హామీ ఇవ్వగలదని, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఇప్పటికే ఉన్న సంక్షేమ చర్యలు,పథకాలను రద్దు చేస్తుందని మోడీ ప్రకటించారు.
మహాయుతికి ఓటేయాలని, తద్వారా రాబోయే ఐదేళ్లలో మహారాష్ట్రని కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని, రాష్ట్రంలో సుపరిపాలన మహాయుతి ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని ప్రధాని అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమి బండికి చక్రాలు లేవు, బ్రేకులు లేవు డ్రైవర్ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి అని ప్రధాని విమర్శించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?