ఆర్థిక రాజధాని, వ్యవసాయం లో కీలక పాత్ర పోషించే మహారాష్ట్ర లో బీజేపీ గెలవడం సంతొషమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబల్ ఇంజన్ సర్కార్ పై మహారాష్ర్ట ప్రజలు అత్యధిక ఓట్లు, సీట్లు ఇచ్చారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ లు ఎత్తివేస్తారని చేసిన ప్రచారం తో కాంగ్రెస్ లబ్ధి పొందిందన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్‌లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉంది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను…
Harish Rao : మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది…
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించే దిశగా పరుగెడుతోంది. మొత్తం 288 స్థానాల్లో 220 కన్నా ఎక్కువ చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇది మ్యాజిక్ ఫిగర్ 145 కంటే చాలా ఎక్కువ. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) 53 సీట్లకే పరిమితయ్యేలా కనిపిస్తోంది. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది.
Ajaz Khan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో 220 కన్నా ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఒక అంశం ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో వైరల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో వెర్సోవా స్థానం నుంచి పోటీ చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌కి ఓటర్లు షాక్ ఇచ్చారు.
Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 శాసన సభ స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సత్తా చాటింది. రాష్ట్రంలో ఘన విజయం దిశగా వెళ్తోంది. మహాయుతిలోని బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు భారీ విజాయాన్ని అందుకున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 125 సీట్లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తోంది. మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఏకంగా 218 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. సొంతగా బీజేపీ 124 స్థానాల్లో, షిండే సేన 55 స్థానాలు, అజిత్ పవార్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కేవలం 58 స్థానాల్లో…
Election Results: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 41. అయితే, బీజేపీ కూటమి, జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి మధ్య లీడ్ మారుతోంది.