మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి, మరాఠా పరాక్రమానికి చిహ్నంగా, సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు.
Election Campaign: నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.
Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ.. ఇటీవల డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు.
Nitin Gadkari: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మహారాష్ట్రలో కేంద్రమంత్రి అమిత్ షా ర్యాలీలన్నీ రద్దయ్యాయి. కేంద్ర హోంమంత్రి హఠాత్తుగా నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వాస్తవానికి, షా ఈ రోజు మహారాష్ట్రలో నాలుగు బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. మణిపూర్ హింసాకాండ కారణంగా ఆయన ఎన్నికల పర్యటన రద్దయినట్లు సమాచారం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణా ర్యాలీలో ప్రసంగించేందుకు అమరావతిలోని దరియాపూర్‌లోని ఖల్లార్ గ్రామానికి చేరుకున్నారు. ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ప్రచార సభలో పెద్ద దుమారమే రేగింది.
CM Revanth Reddy: శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజవర్గం గుగ్గూస్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..