Ajit Pawar: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచి వారం గడిచింది. అయితే, ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, ముంబైలో రాష్ట్ర నేతలతో బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎన్సీపీ, శివసేనలు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా డిసెంబర్ 05న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ రోజే ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ ఈ రోజు స్పష్టం చేసింది.
Read Also: white hair : 30 ఏళ్ల వయసులోనే జుట్టు నెరిసిపోతుందా? కారణం ఏంటో తెలుసుకోండి ?
ఇదిలా ఉంటే, తాజాగా ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉంటారని, ఇతర మిత్రపక్షాలైన ఏక్‌నాథ్ షిండే శివసేనకి, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయని చెప్పారు. “సమావేశంలో (మహాయుతి నాయకుడి ఢిల్లీ సమావేశం) మహాయుతి బిజెపి నుండి ముఖ్యమంత్రితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మరియు మిగిలిన రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని నిర్ణయించారు. ఆలస్యం జరగడం ఇది మొదటిసారి కాదు. మీకు గుర్తుంది, 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నెల సమయం పట్టింది.’’ ఆయన అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్, శివసేన షిండేల మహాయుతి కూటమి 288 స్థానాలకు గానూ 233స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లలో గెలుపొందాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 46 సీట్లను గెలుచుకుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ 10 సీట్లకే పరిమితమయ్యాయి.