Maharashtra: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెలువడిని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలు గెలుచుకుని మరోసారి మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, ఫలితాలు వచ్చి నాలుగు రోజలు అవుతున్నా.. సీఎం ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also: Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు శివసేన చీఫ్, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే సీఎం రేసులో ముందు వరసలో ఉన్నారు. తాజాగా సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు మహాయుతికి చెందిన ముగ్గురు నేతలు రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షాని కలవనున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వస్తుందని మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. బీజేపీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండాలని కోరుకుంటుంటే, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.