కొన్ని మతతత్వ శక్తులు, సంఘవిద్రోహులు దేశంలో మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ దయాది దేశం పాకిస్తాన్ కు జిందాబాద్ కొడుతున్నారు. గతంలో దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో కట్ని జిల్లాలో చోటు చేసుకుంది. చాకా గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలో కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. వీడియోలో 30-40 మంది నినాదాలు చేస్తూ కనిపించారు. అయితే వీడియో వాస్తవికతపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. వైరల్ అయిన వీడియోలో గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు ‘ జీత్ గయా భాయ్ జీత్ గయా పాకిస్తాన్ జీత్ గయా’ అనే నినాదాలు చేయడం కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read Also:Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 516 మందికి పాజిటివ్
ప్రస్తుతం దేశంలో సున్నిత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పలు చోట్ల విధ్వంసం జరిగింది. తాజాగా గత వారం రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు మతోన్మాదులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన కన్నా ముందు మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కూడా ఇలాగే చంపారు. వీరిద్దరు కూడా నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రెండు ఘటనలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.