Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన రెండు మామిడి చెట్లకు ముగ్గురు గార్డులను, 6 వాచ్‌డాగ్‌లను సెక్యురిటీగా పెట్టాడు. మీరు వింటున్నది నిజమే.. మామిడి చెట్లకు అది కూడా రెండింటికి ఇంత సెక్యురిటీ ఎందుకా.. అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఇది అలాంటి ఇలాంటి మామిడి చెట్లు కావు. అరుదైన, అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి చెట్లు. మియాజాకి మామిడి పండ్ల ధర కేజీకి రూ. 2.7 లక్షలు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రైతు తన మామిడి చెట్లను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా ట్విట్టర్ లో పంచుకున్నాడు.
రూబీ కలర్ లో ఉండే జపనీస్ మామిడి జాతి, మియాజాకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి, కిలో రూ.2.7 లక్షలకు విక్రయించబడింది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో పరిహార్ అనే రైతు తన రెండు చెట్లను కాపాడుకునేందుకు ముగ్గురు సెక్యురిటీ గార్డులు, 6 కాపలా కుక్కలను నియమించుకున్నాడని హర్షాగోయెంకా ట్వీట్ చేశారు. అయితే ఓ నెటిజెన్ ఈ మామిడి పండు తింటే ఏం అవుతుందని ప్రశ్నించినప్పుడు.. ‘ఏముంది కడుపు నిండుతుందని’ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
Also Read
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
Read Also: Deepika Padukone: పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తే తప్పేంటి?
ఏడాది క్రితం పండ్ల తోటల పెంపకందారుడు సంకల్ప్ పరిహార్ అతని భార్య రాణిలు మియాజాకి రకానికి చెందిన రెండు మామిడి చెట్లను నాటారు. అయితే తొలుత ఈ మామిడి పండ్లు రూబీ కలర్ లో ఉంటాయని, వాటి ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలియదు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండు అని తెలిసిన తర్వాత దీనికి భారీ రక్షణ ఏర్పాటు చేశాడు. మియాజాకి ఆకారం, ఎర్రటి రంగు కారణంగా ‘ఎగ్స్ ఆఫ్ సన్‌షైన్’ అని పిలుస్తారు. అయితే దీన్ని విలువ తెలిసిన తర్వాత స్థానిక దొంగలు వీటిని దొంగలించే ప్రయత్నం చేశారు. దీంతో అసాధారణ రీతిలో పరిహార్ ఈ రెండు చెట్లకు భద్రత కల్పిస్తున్నాడు.
మియాజాకి అనేది జపాన్ లో ఓ నగరం పేరు. సగటున ఒక్కో మామిడి పండు 350 గ్రాముల బరువు ఉంటుంది. యాంటీ ఆక్సికెంట్లు, బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఈ మామిడి పండులో పుష్కలంగా ఉంటాయి. ఎప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఈ మామిడి పండ్లు కోతకు వస్తాయి.
The unusual ruby-coloured Japanese breed of mango, Miyazaki is said to be world's costliest mango, sold at Rs 2.7 lakh per kg. Parihar a farmer in Jabalpur, Madhya Pradesh has hired three security guards and 6 dogs to secure the two trees. pic.twitter.com/DxVWfjMT8F
— Harsh Goenka (@hvgoenka) July 3, 2022
తాజావార్తలు
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!